Breaking News

యూపీ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Published on Thu, 10/24/2024 - 11:55

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్‌(ఎస్‌పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్‌ను నిలబెట్టింది. కాన్పూర్‌లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్‌ నుంచి సంజీవ్ శర్మ,  ఖైర్ (ఎస్‌సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్‌ నుంచి అనుజేష్ యాదవ్‌, ఫుల్‌పూర్‌ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్,  మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.

నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్‌ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు.
 

ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)