Breaking News

ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?.. రేసులో పర్వేశ్‌ వర్మ

Published on Sun, 02/09/2025 - 04:39

న్యూఢిల్లీ:  ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై నెగ్గిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ వర్మ(47) పేరు మార్మోగిపోతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంంలో కేజ్రీవాల్‌పై 4,089 ఓట్ల తేడాతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జెయింట్‌ కిల్లర్‌గా అవతరించారు. వర్మకు 30,088 ఓట్లు, కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్‌కు 4,568 ఓట్లు లభించాయి. 

పశ్చిమ ఢిల్లీకి చెందిన పర్వేశ్‌ వర్మ రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. ఓటర్లకు చేరువయ్యారు. ఎన్నికలకు రెండు నెలల ముందే ఇంటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గరిష్ట స్థాయిలో ఓటర్లను కలుసుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్‌ వర్మ కుమారుడైన పర్వేశ్‌వర్మ ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఓడించి, బీజేపీ తరపున నూతన ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు.  

బాల్యం నుంచే సంఘ్‌ భావజాలం  
పర్వేశ్‌ వర్మ 1977 నవంబర్‌ 7న ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. తండ్రి బాటలో నడుస్తూ 1991లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. బాల స్వయంసేవక్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీ యువమోర్చాలో చేరారు. యువమో ర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు. తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలోని మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 

2019లో అదే నియోజకవర్గంలో 4.78 లక్షల ఓట్ల మెజార్టీతో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి సాహిబ్‌సింగ్‌ వర్మ స్థాపించిన ‘రా్ష్ట్రీయ స్వాభిమాన్‌’ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకుంటున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన పర్వేశ్‌ వర్మ మంచి వక్తగా పేరుగాంచారు. ఇప్పటి ఎన్నిల్లో కేజ్రీవాల్‌ను తానే ఢీకొట్టబోతున్నానని బహిరంగంగా ప్రకటించారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి కేజ్రీవాల్‌ సీఎం అయ్యారు. రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్‌ శర్మ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)