Breaking News

జనవరిలోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు!

Published on Mon, 12/30/2024 - 05:51

సాక్షి, న్యూఢిల్లీ: జనవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 10 నాటికి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తికానుండగా, రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు 15 నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత జనవరి నెలాఖరు కల్లా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన పురోగతిపై అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నుంచి నివేదిక తీసుకున్నారు.

అంతేగాక  పార్టీ అంతర్గత ఎన్నికలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ జాతీయ పదాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి డి.పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. 

నడ్డా దిశా నిర్దేశం 
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించడం, దేశంలోని వివిధ ప్రదేశాలలో అటల్‌జీ జీవితానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించడంపై నడ్డా దిశానిర్దేశం చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, విజయాలు, ప్రధానంగా కార్గిల్‌ యుద్ధం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన, పోఖ్రాన్‌ అణు పరీక్ష, స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి ప్రాజెక్ట్, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ వంటి విజయాలను ప్రదర్శించనున్నారు. ఇలావుండగా వివాదాస్పద అంశాలపై ప్రకటనలు, వ్యాఖ్యలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)