Breaking News

ఎంపీ మహువాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ ముందుకు ఫిర్యాదు

Published on Tue, 10/17/2023 - 14:48

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఎథిక్స్‌ కమిటీకి సిఫార్సు చేశారు.  బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోన్‌ఖర్‌ లోక్‌సబ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. కాగా మహువా మోయిత్రాపై నిషికాంత్‌  తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసి మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి ఎంపీ మహువా కోట్ల రూపాయలు తీసుకున్నారని తన లేఖలో పేర్కొన్నారు.

2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని తెలిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు లాయర్‌ తనకు అందించారని, తక్షణమే మహువాను లోక్ సభ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

దీనిపై విచారణ చేయాలని కోరుతూ.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర ఐటీశాఖ మంత్రి అ‍శ్వినీ వైష్ణవ్‌, సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్‌సైట్‌కు సంబంధించి తన లాగిన్‌ వివరాలను ఎవరికైనా ఇచ్చారా అనే విషయాలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే నిషికాంత్‌ దూబే ఆరోపణలపై తృణమూల్‌ ఎంపీ ఘాటుగా స్పందించారు.  నిషికాంత్‌ దూబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తును పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్‌ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని తేల్చి చెప్పింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)