Breaking News

శివరాజ్‌ ‘రామ్‌ రామ్‌’ ట్వీట్‌: బీజేపీ కీలక ప్రకటన

Published on Sun, 12/10/2023 - 11:50

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన ‘అందరికీ రామ్‌రామ్‌’ ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే ట్వీట్‌పై తాజాగా బీజేపీ స్పందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక పక్క కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ మొదలవనుండగా శివరాజ్‌ రామ్‌రామ్‌ ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే మధ్యప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ వి.డి శర్మ శివరాజ్‌ ట్వీట్‌పై తాజాగా వివరణ ఇచ్చారు. ఆ ట్వీట్‌కు పెద్ద ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఇది రామజన్మభూమి అని, జనవరిలో అయోధ్యలో  రామ మందిరం ప్రారంభమవనున్నందున శుభాకాంక్షలు చెప్పేందుకు శివరాజ్‌ అలా ట్వీట్‌ చేసి ఉంటారని తెలిపారు.

మధ్యప్రదేశ్‌ కొత్త  సీఎం ఎంపిక కోసం హరియాణా సీఎం మనోహర్‌ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో హైకమాండ్‌ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం భోపాల్‌లో కొత్త  సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించనుంది. 

పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్న కమిటీ సీఎం ఎవరన్నదానిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్‌ సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్‌ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఉన్నారు.

ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)