Breaking News

కళంకిత నేతల తొలగింపు బిల్లు కమిటీకి అపరాజిత సారంగి సారథ్యం 

Published on Thu, 11/13/2025 - 05:36

న్యూఢిల్లీ: తీవ్ర నేరపూరిత కేసుల్లో 30 రోజులకు మించి జైళ్లో గడుపుతున్న కళంకిత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ బుధవారం ఏర్పాటుచేసింది. బీజేపీ మహిళా ఎంపీ అపరాజితా సారంగి జేపీసీకి సారథ్యంవహిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

అప్రతిష్ట మూటగట్టుకున్న నేతలను పదవుల నుంచి తొలగించేందుకు ఇటీవల కేంద్రప్రభుత్వం రాజ్యాంగ(130వ సవరణ)బిల్లు– 2025, జమ్మూ, కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ)బిల్లు–2025, కేంద్రపాలిత ప్రభుత్వాల(సవరణ)బిల్లు–2025లను తీసుకురావడం తెల్సిందే. ఈ బిల్లులను సమీక్షించేందుకు లోక్‌సభ మొత్తంగా 31 మంది సభ్యులతో జేపీసీని బుధవారం ప్రకటించింది. విపక్ష పార్టీలు ఈ కమిటీని బహిష్కరించినప్పటికీ నలుగురు విపక్ష పార్టీల సభ్యులకు కమిటీలో చోటు కలి్పంచారు. 

ఒక నామినేట్‌ సభ్యుడు సహా బీజేపీ నుంచి 15 మంది, ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల నుంచి 11 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ లోక్‌సభ సభ్యులు రవిశంకర్‌ ప్రసాద్, భర్తృహరి మహతాబ్, ప్రదాన్‌ బారువా, బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్, విష్ణుదయాళ్‌ రామ్, డీకే అరుణ, పురుషోత్తమ్‌భాయ్‌ రూపాలా, అనురాగ్‌ ఠాకూర్, బ్రిజల్‌ లాల్, ఉజ్వల్‌ నికమ్, నబామ్‌ రేబియా, నీరజ్‌ శేఖర్, మనన్‌ కుమార్‌ మిశ్రా, కె. లక్ష్మణ్‌లు కమిటీలో ఉన్నారు. ఎన్సీపీ–ఎస్పీ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే, అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ బాదల్, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, వైఎస్సార్‌సీపీ సభ్యుడు నిరంజన్‌ రెడ్డి తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్‌లో సభ్యత్వం తీసుకోబోమని ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ప్రకటించాయి.  ఎన్‌డీఏ కూటమిలోని దాదాపు ప్రతి పార్టీ తరఫున ఒకరికి కమిటీలో ప్రాధాన్యతదక్కింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)