Breaking News

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్‌ గుప్తా

Published on Tue, 02/25/2025 - 06:21

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార బీజేపీ శాసనసభ్యుడు విజేందర్‌ గుప్తా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సెషన్‌ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్‌ సింగ్‌ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు.

 అనంతరం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుప్తా పేరును స్పీకర్‌ పదవికి ప్రతిపాదిస్తూ సీఎం రేఖా గుప్తా, మంత్రి రవీందర్‌ ఇంద్రజ్‌ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, వీటిని మంత్రులు పర్వేశ్‌ వర్మ, మంజిందర్‌ సింగ్‌ బలపరిచారు. మూడువాణి ఓటుతో తీర్మానాలను సభ ఆమోదించిందని ప్రొటెం స్పీకర్‌ అర్వీందర్‌ సింగ్‌ లవ్లీ ప్రకటించారు. దీంతో, సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ వెంట రాగా కొత్త స్పీకర్‌ కుర్చీలో ఆసీనులయ్యారు.

 స్పీకర్‌ విజేందర్‌ గుప్తాకు సీఎం రేఖా గుప్తా శుభాకాంక్షలు తెలపగా, ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహించడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో బీఆర్‌ అంబేడ్కర్, భగత్‌ సింగ్‌ల ఫొటోలను తీసేయడం చూస్తే బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి తేటతెల్లమవుతోందని ఆరోపించారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. 

అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని తొలగించవద్దని అనంతరం ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ ‘ఎక్స్‌’లో బీజేపీని కోరారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టి, అంబేడ్కర్‌ ఫొటోను తీసేయడం కోట్లాది మంది ఆయన అనుచరుల మనస్సులను గాయపరిచినట్లేనన్నారు.

ఆరు భాషల్లో ఎమ్మెల్యేల ప్రమాణం
సెషన్‌ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్‌ సింగ్‌ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. వీరు హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, మైథిలి, పంజాబీ భాషల్లో ప్రమాణం చేయడంతో అసెంబ్లీలో భాషాపరమైన వైవిధ్యం ప్రతిఫలించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)