Breaking News

Hema Malini Assets Worth: హేమమాలిని ఆస్తులు వంద కోట్లకు పైగానే..

Published on Fri, 04/05/2024 - 21:01

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్‌, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు. 

అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్,  రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్‌కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ.  43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని  బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు.  
చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్‌పై కంగన మరో ట్వీట్‌ వైరల్‌

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు