Breaking News

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది: కేజ్రీవాల్‌ 

Published on Tue, 08/26/2025 - 04:49

న్యూఢిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్యాన్నే కాదు.. మొత్తం వ్యవస్థనే అపహాస్యం చేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీఛార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం నెలలుగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేయగా.. చాలా మంది గాయపడ్డారు. 

కవర్‌ చేయడానికి వచ్చిన మీడియానూ అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై కేజ్రీవాల్‌ స్పందించారు. ‘అభ్యర్థుల చెప్పేది వినడానికి బదులుగా, రాత్రి చీకటిలో వారిని లాఠీలతో కొట్టారు. ఊహించుకోండి... నిన్న పుస్తకాలు పట్టుకున్న చేతులకు ఇప్పుడు గాయాల గుర్తులు మిగిలాయి’అని ఆయన ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీ నియంతృత్వం చూడండి... దేశంలో దుండగులు బహిరంగంగా రాజ్యమేలుతున్నారు.

 బీజేపీని ప్రశ్నించే వారిపై లాఠీ ఛార్జీలు ఝుళిపించి నోరు మూయిస్తున్నారు. ఎవరినైనా అరెస్టు చేసి జైలులో పెట్టవచ్చు, ఏ చట్టాన్నైనా వారు కోరుకున్నప్పుడల్లా మార్చవచ్చు. ఎవరైనా బీజేపీకి ఓటు వేయకపోతే, వారి ఓటు తీసేస్తారు’అని పేర్కొన్నారు.   ఎస్‌ఎస్‌సీ.. మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలోని వివిధ పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహించే ఒక చట్టబద్ధమైన సంస్థ. 

జూలై 24 నుంచి ఆగస్టు 1 మధ్య 142 నగరాల్లోని 194 కేంద్రాల్లో 13 ఫేజుల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. అయితే.. ఆకస్మిక రద్దులు, సాఫ్ట్‌వేర్‌ క్రాష్‌లు, బయోమెట్రిక్‌ ధ్రువీకరణలో వైఫల్యాలు, తప్పుడు సెంటర్‌ కేటాయింపుల వంటి సమస్యలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలపై ఢిల్లీ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆశావహులు వీధుల్లోకి వచ్చారు. సోషల్‌ మీడియాలోనూ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని, అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)