Breaking News

పార్లమెంట్‌ భేటీకి ముందే బీజేపీకి కొత్త అధ్యక్షుడు! 

Published on Sat, 06/14/2025 - 06:07

సాక్షి, న్యూఢిల్లీ: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికను వచ్చే నెల జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాలకు ముందుగానే ముగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 21న పార్లమెంట్‌ సమావేశాలు ఆరంభమయ్యే ముందునాటికే జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది. 

ఆగస్టు 15 నుంచి బిహార్‌ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాల దృష్ట్యా, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పదేపదే వాయిదా పడుతూ వస్తుంది. మే నెలలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినా ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. అధ్యక్ష బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లపైనా పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయి. 

ప్రధాన పోటీదారుల జాబితాలో కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, జి.కిషన్‌రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు సునీల్‌ బన్సల్, బీఎల్‌ సంతోష్‌ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లో బిహార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబర్‌లోగా ఎన్డీఏ కూటమి పక్షాలతో సీట్ల పంపకాలు, పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాల్సి ఉంది. ఇది జరగాలంటే ఆగస్టు నుంచే బిహార్‌ ఎన్నికలపై ఆగస్టు నుంచే పూర్తి స్థాయి ఫోకస్‌ పెట్టాల్సి ఉంది. 

అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్నాయి. పార్టీ కీలక నేతంలతా సమావేశాల్లో బిజీగా ఉండే నేపథ్యంలో, సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చే యాలని, అలా అయితేనే ఆయన సారథ్యంలో బిహార్‌ ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చనే భావనలో పార్టీ ఉంది. దీనికై ఈ నెల చివరి వారంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంది. పార్టీ నియమావళి ప్రకారం జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సగానికి పైగా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. 

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ వంటిì చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. వీరిని త్వరలోనే ప్రకటించే దిశగా ఇప్పటికే కీలక చర్చలు ముగిశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి ప్రకటన ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మూడేళ్ల కాలంలో యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్‌ వంటి కీలక రాష్ట్రాలతో పాటు మొత్తంగా 12 రాష్ట్రాల ఎన్నికలు ఈయన సారధ్యంలోనే జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సైతం కొత్త అధ్యక్షుడి హాయంలోనే ఉండనున్నాయి.   
 

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)