Breaking News

బీజేపీ నేత దారుణ హత్య.. కారణం అదేనా?

Published on Fri, 08/11/2023 - 09:27

లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అధికార పార్టీ నేతను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో, బీజేపీ నేత హత్య యూపీలో సంచలనంగా మారింది. 

వివరాల ప్రకారం.. శంభాల్‌ జిల్లాలోని మొరదాబాద్‌కు చెందిన బీజేపీ నేత అనూజ్‌ చౌదరీ(34)  దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం మొరాదాబాద్‌లోని ఆయన నివాసం బయటే ఆయనను కాల్చి చంపారు. అనూజ్ చౌధురి తన అపార్ట్‌మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి గురువారం సాయంత్రం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. 

పొలిటికల్‌ ప్రత్యర్థుల పనేనా..
ఇక, కాల్పుల ఘటన ఆయన నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. ఎస్పీ హేమ్‌రాజ్ మీనాతో సహా పోలీసు అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అనూజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనూజ్‌పై కాల్పుల ఘటనలో అస్మోలీ బ్లాక్‌ చీఫ్‌ కుమారుడు అనికేత్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ట తెలిపారు. ఇక, అనూజ్‌ హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు అమిత్, అనికేత్‌లుగా బాధిత కుటుంబం తెలిపింది.

ఇదిలా ఉండగా..  స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న అనూజ్.. రెండేళ్ల కిందట జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్‌లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనూజ్‌కు బీజేపీ కీలక నాయకులు, మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మోదీకి కాంగ్రెస్‌ ఫోబియా  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)