Breaking News

అతని ఆట ఇక ముగిసింది: జయప్రద

Published on Mon, 02/20/2023 - 14:40

లక్నో: బీజేపీ నేత, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద.. సమాజ్ వాదీ సీనియర్ ఆజాంఖాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నో పాపాలు చేశారని,  చేసిన తప్పులకు ఆయన తప్పక శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. 
 
ఆదివారం మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాజీ నటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీల మధ్య వైవిధ్యాలు, విభేధాలు సహజం. కానీ, అధికారం ఉంది కదా అని మహిళలను అగౌరవపరచడం, పేదలకు అన్యాయం చేయడం సరికాదు. అజాం ఖాన్ ఆయన వారసుడు అబ్దుల్లా ఖాన్ లకు మహిళలను గౌరవించడం  ఏమాత్రం తెలియదు. ఆజాం ఖాన్ ఆట ముగిసింది.  చేసిన పాపాలకు వాళ్లు అనుభవించకతప్పదు అని జయప్రద పేర్కొన్నారు. 

ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక  ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆమె.. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ కూడా బీజేపీ వశం అవుతుందని జోస్యం చెప్తున్నారామె.

ఇదిలా ఉంటే.. జయప్రద, ఆజాంఖాన్ గతంలో  పరస్పర విమర్శలతో వివాదాల్లో చిక్కుకున్నారు. 2019  ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగగా.. ఆజాం ఖాన్ ‘ఖాకీ అండర్ వేర్‘ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు ఆ టైంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. 

కిందటి ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు  ఆజాం ఖాన్. అయితే.. 2019 లోక్ సభ ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో ఆజాంఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో చట్ట ప్రతినిధుల నిబంధనల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు పడింది. తాజాగా ఇక ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్ కు(ఆజాంఖాన్ కు కూడా) తాజాగా 2008 నాటి కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష విధించగా.. ఎమ్మెల్యే పదవిని అనర్హతతో కోల్పోయారాయన. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)