Breaking News

లోక్‌సభలో డానిష్‌ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sat, 09/23/2023 - 06:00

న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్‌–3 మిషన్‌ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్‌పీ ఎంపీ డానిష్‌ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ విచారం వ్యక్తం చేశారు.

బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్‌ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్‌ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్‌ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఘటనపై బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి స్పందించారు. రమేశ్‌ బిధూరీకి బీజేపీ షోకాజ్‌ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్‌ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు.  కాంగ్రెస్, ఎన్‌సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్‌ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి పంపాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు.

ప్రివిలేజ్‌ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్‌ అలీ లేఖ
లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి పంపాలని బీఎస్‌పీ ఎంపీ డానిష్‌ అలీ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు.

అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్‌ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్‌ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్‌ అండ్‌ కాండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌లోని రూల్‌ నంబర్‌ 227 కింద ప్రివిలేజ్‌ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్‌ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)