Breaking News

విరాళాల సేకరణలో బీజేపీ టాప్‌.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు

Published on Wed, 07/12/2023 - 11:39

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల సేకరణలో అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందంజలో ఉంది. భారత రాజకీయాల్లో సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఎలక్టోరల్‌ బాండ్లు, ప్రత్యక్ష కార్పొరేట్‌ విరాళాలు సహా ఇతర విరాళాల ద్వారా మొత్తంగా ఆరేళ్లలో రూ.10,122 కోట్లు బీజేపీకి వచ్చాయి.

బీజేపీ ప్రకటించిన మొత్తం విరాళాలు ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ విరాళాల రూపంలో రూ.1547.439 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.823.301 కోట్లు, సీపీఐ(ఎం) రూ.367.167 కోట్లు, ఎన్సీపీ రూ.231.614 కోట్లు సేకరించాయి.

ప్రాంతీయ పార్టీల్లో బీజేడీ
తీయ పార్టీల జాబితాలో బిజు జనతాదళ్‌ (బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్లు విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణరాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌ రూ.476.89 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు, వైఎస్‌ఆర్‌సీపీ రూ.456.20 కోట్లు, శివసేన రూ.267.90 కోట్లు, ఆప్‌ రూ.169.70 కోట్లు, టీడీపీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి.
చదవండి: ఆ తేనేలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)