Breaking News

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?

Published on Mon, 12/04/2023 - 18:48

New Chief Ministers: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనే  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖరారైన ముఖ్యమంత్రుల పేర్లను బీజేపీ ఇంకా వెల్లడించలేదు. 

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో బీజేపీ రికార్డ్‌ స్థాయిలో సీట్లు గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లో 163 ​​సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు గెలిచి కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 

సీఎం అభ్యర్థులు వీళ్లే..?
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్నారు. అక్కడ బీజేపీ అఖండ విజయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే మరోసారి కొనసాగించే అవకాశం ఉంది.  

బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్‌ చౌహాన్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ మస్టల్ శర్మపై 1,04,974 ఓట్ల బంపర్‌ మెజార్టీతో విజయం సాధించారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం 2006 నుంచి ఆయనకు కంచుకోటగా ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. 

ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)