Breaking News

బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? 

Published on Sun, 06/29/2025 - 04:17

న్యూఢిల్లీ:  బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. 

బీజేపీ నియమావళి ప్రకారం, జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్ర శాఖల (స్టేట్‌ యూనిట్ల) అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వాలి. దేశవ్యాప్తంగా బీజేపీకి 37 రాష్ట్ర శాఖలు ఉన్నాయి. అంటే 19 రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటివరకు పార్టీ 14 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిచేసింది. మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశముంది. జూలై రెండో వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఇలా..  
బీజేపీ దశలవారీ ప్రక్రియ ద్వారా అధ్యక్షుడిని ఎంచుకుంటుంది. ముందుగా బూత్‌ అధ్యక్షులు, ఆ తర్వాత మండల అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారు. సగం జిల్లాల అధ్యక్షులు ఎంపికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారు. అలాగే 19 రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమవుతుంది. చాలా సందర్భాల్లో ఈ ఎన్నికలు ఏకగ్రీవ పద్ధతిలోనే జరుగుతాయి. పార్టీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం కలిసి బీజేపీ జాతీయ అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేస్తారు.  

కొత్త అధ్యక్షుడి ముందు సవాళ్లు 
జేపీ నడ్డా జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం జనవరి 2023లోనే ముగిసింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై దృష్టి పెట్టారు. కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే 2025లో బిహార్, 2026లో పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది.  

కుల, ప్రాంత సమీకరణపై దృష్టి  
కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో కుల సమీకరణ, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటారు. పలువురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అందువల్ల కేంద్ర కేబినెట్‌లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి మోదీ జూలై 2 నుంచి 9వ తేదీ వరకు ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విదేశాల నుంచి తిరిగివచి్చన తర్వాత, జూలై రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)