Breaking News

లోక్‌సభ ఎన్నికలపై అస్సాం సీఎం కీలకవ్యాఖ్యలు

Published on Thu, 03/14/2024 - 15:35

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాల్లో 13 స్థానాలను భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయి. ఈ విషయాన్ని గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' ప్రకటించారు.

కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ సారి తప్పకుండా 13 సీట్లు గెలుస్తామనే నమ్మకం వచ్చిందని హిమంత బిస్వా అన్నారు. అంతే కాకుండా డిబ్రూగఢ్‌ (Dibrugarh)లో సర్బానంద సోనోవాల్ మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. అయితే ధుబ్రి (Dhubri) సీటును గెలవలేమని ప్రస్తావించారు.

అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసి చాలా సంతోషించాను. ఈ ఏట కాంగ్రెస్ పరాభవం తప్పదని.. మొత్తం ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేకపోవచ్చని అస్సాం డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ అన్నారు. 

అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP) బార్‌పేట, ధుబ్రీ స్థానాల్లో, యూపీపీఎల్ కోక్రాఝర్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే జోర్హాట్‌లో గౌరవ్ గొగోయ్, నాగావ్‌లో ప్రద్యుత్ బోరోడోలోయ్, గౌహతిలో మీరా బర్తకూర్ గోస్వామి, ధుబ్రిలో రకీబుల్ హుస్సేన్, దీపూలో జైరామ్ ఇంగ్లెంగ్ సహా అస్సాంలోని 12 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)