Breaking News

Durga Puja:‘ముందుగానే నిమజ్జనం చేయిస్తారా?’.. టీఎంసీపై బీజేపీ మండిపాటు

Published on Sun, 09/28/2025 - 11:05

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న దుర్గా పూజలను అడ్డుకునేందుకు అధికార టీఎంసీ ప్రయత్నిస్తున్నదని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో  ‘ఆపరేషన్‌ సింధూర్‌’ థీమ్‌తో ఏర్పాటు చేసిన వేదికపై జరుగుతున్న దుర్గా పూజ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని,  ఇది సిగ్గుచేటని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. టీఎంసీ కల్పిస్తున్న ఆటంకాలను చూస్తుంటే, మండప నిర్వాహకులు భయంతో విజయదశమికి ముందుగానే దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఉన్నారని అమిత్ మాల్వియా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ  ఏడాది కోల్‌కతాలో దుర్గా పూజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ పూజల ప్రారంభానికి ముందు నుంచే అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ థీమ్‌తో ఏర్పాటు చేసిన మండపంలో పూజలను టీఎంసీ అడ్డుకుంటున్నదని మాల్వియా ఆరోపించారు. మరోవైపు భక్తులు వేడుకల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు  కోల్‌కతా వీధుల్లో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. మాల్వియా తన ‘ఎక్స్’ ఖాతాలో .. దుర్గా పూజల్లో టీఎంసీ అనుసరిస్తున్న చర్యలు భారతదేశ ప్రజల జాతీయ గౌరవాన్ని కోల్పోయేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అడ్డంకులు ఇలాగే కొనసాగితే, దశమి కంటే ముందే నిర్వాహకులు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయవలసిన స్థాయికి పరిస్థితి దిగజారాలా ఉందని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతా నడిబొడ్డున ఇటువంటి హిందూ వ్యతిరేక చర్యలకు మమతా సర్కారు అనుమతిస్తే, అది తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

కాగా శుక్రవారం అమిత్ షా కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో దుర్గా పూజా మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన.. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వర్ణ బెంగాల్ వైభవాన్ని పునరుద్ధరించగల ప్రభుత్వాన్ని తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కలలను ప్రతిబింబించే విధంగా, సురక్షితమైన, సంపన్నమైన, ప్రశాంతమైన బెంగాల్ దార్శనికతను నెరవేర్చేలా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన దుర్గామాతను ప్రార్థించారు. ప్రజలకు దుర్గాపూజ శుభాకాంక్షలు తెలిపారు. 
 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)