Breaking News

బీజేపీ-బీజేడీ: 15ఏళ్ల తర్వాత సరికొత్త పాలిటిక్స్‌!

Published on Thu, 03/07/2024 - 09:49

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు పలు పార్టీలు ఆసక్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయేలోకి బీజేడీ(బిజూ జనతా దళ్ పార్టీ) చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ, బీజేడీ మధ్య సంప్రదింపులు కూడా జరగడం విశేషం.

కాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ.. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందా?.. దాదాపు 15 ఏళ్ల  తర్వాత తిరిగి ఎన్డీయేతో చేతులు కలపబోతోందా? అంటే నిజమేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్డీయేలో చేరిక, బీజేపీతో పొత్తుపై తాజాగా సీఎం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం ‘నవీన్ నివాస్‌’ బీజేడీ నేతల విస్తృతమైన సమావేశం జరిగింది.

►ఇక, ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్‌తో పాటు కీలక నేతలు ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, బీజేడీతో పొత్తు అవకాశాలపై చర్చించారు. 

►మరోవైపు.. బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా పొత్తుపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే, తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒడిషా ప్రజల ప్రయోజనం కోసమేనని చెప్పుకొచ్చారు.

►ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ జుయల్ ఓరం మాట్లాడుతూ.. బీజేడీతో పొత్తుపై ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. ఫైనల్ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని అన్నారు.

అంతకుముందు ఇలా..
గతంలో 1998లో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా 1998, 1999, 2004లో లోక్‌సభ ఎన్నికలు, 2000, 2004 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీలు సత్తా చాటాయి. కాగా, అనూహ్యంగా 2009లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో బీజేడీకి తక్కువ స్థానాలు ఇవ్వడంతో కూటమి విడిపోయింది. ఇక, తాజాగా మరోసారి దాదాపు 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)