Breaking News

‘సింగిల్‌ బల్బుకు రూ.86 లక్షల బిల్లు!’

Published on Mon, 11/25/2024 - 19:41

అతనిది సింగిల్‌ రూమ్‌ షెటర్‌లో టైలరింగ్‌ షాపు. ప్యాంట్లు, చొక్కాలతో పాటు షేర్వాణీలు కుడుతుంటాడు. నెల నెలా కరెంట్‌ బిల్లును ఫోన్‌ పేలో కడుతుంటాడు. ఉన్న సింగిల్‌ బల్బ్‌కు నెలలో రోజంతా కరెంట్‌ వాడినా.. నెలకు రూ.2 వేలు రావడం కూడా కష్టమే. అయితే ఈ నెల బిల్లు చూడగానే.. గుండె ఆగినంత పనైందట అతనికి. ఏకంగా 86 లక్షల బిల్లు వచ్చింది.

గుజరాత్‌ వల్సద్‌కు చెందిన అన్సారీ.. తన మామతో కలిసి టేలర్‌ షాప్‌ నడుపుతున్నాడు. కరెంట్‌ బిల్లు నెల నెల ఫోన్‌ పేలో కడుతుంటాడు. అయితే ఈ నెల బిల్లు చూసి అతని కళ్లు బయర్లు కమ్మాయట. ఏకంగా 86 లక్షల బిల్లు రావడంతో.. ఎలక్ట్రిసిటీ బోర్డుకు పరుగులు తీశాడు. ఆ వెంటనే డిస్కం సిబ్బంది సైతం అంతే వేగంగా అతని షాపు మీటర్‌ను పరిశీలించారు. అయితే..

వల్సద్‌లో ఇతని దుకాణం ఉన్న ఏరియాకు దక్షిణ్‌ గుజరాత్‌ విజ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి పవర్‌ సప్లై జరుగుతుంది. ఈ పరిధిలో గుజరాత్‌ ఏడు జిల్లాల నుంచి 32 లక్షల మంది ఉన్నారు. ఇతని షాప్‌ మీటర్‌లో రెండు డిజిట్స్‌ పొరపాటున ఎక్కువ యాడ్‌ అయ్యాయట. అలా.. అతనికి అంతలా బిల్లు వచ్చిందని సిబ్బంది గుర్తించారు.

వెంటనే సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకుని.. రివైజ్‌ బిల్లును అన్సారీ చేతిలో పెట్టారు. అందులో రూ.1,540 మాత్రమే ఉంది. దీంతో హమ్మాయ్యా అనుకున్నాడా టైలర్‌. అయితే బిల్లు సంగతి ఏమోగానీ.. ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడతని టైలర్‌ షాప్‌కు సెల్ఫీల కోసం  జనం క్యూ కడుతున్నారట. దీంతో అన్సారీ హ్యాపీగా ఫీలవుతున్నాడు.

 Video Credits: Zee 24 Kalak

ఇదీ చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్‌ సర్వీస్‌ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)