Breaking News

మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్‌ గ్యాంగ్‌

Published on Sun, 10/13/2024 - 08:49

ముంబై:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు నిందితులు  కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు అయిన నిందితులు విచారణలో తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని చెప్పారని సమాచారం.

అరెస్టయిన ఇద్దరు నిందితుల పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ అని పోలీసులు గుర్తించారు. కర్నైల్ సింగ్ హర్యానా నివాసి కాగా, ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్ నివాసి.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు గత 25-30 రోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ చేశారు. ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో బాంద్రా వద్దకు వచ్చారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు, ఆ ముగ్గురూ కొంతసేపు అక్కడ వేచి ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపేందుకు నిందితులు 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించారు. ముష్కరులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని బాంద్రా పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీకి తగిలాయి. హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.  పరారైన మూడో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు కోణాల్లో క్రైం బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకటి బాంద్రాలోని ఎస్‌ఆర్‌ఏ వివాదానికి సంబంధించినది. మరొకటి లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించినది. బాబా సిద్ధిఖీ.. బాంద్రా (పశ్చిమ) అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
 

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)