Breaking News

మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం..

Published on Mon, 01/19/2026 - 07:14

కన్నూర్: కేరళలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. కన్నూర్ జిల్లా ఇరిట్టిలోని ఎడక్కనడం ప్రాంతంలో కాకుల్లో హెచ్‌5ఎన్‌1 లక్షణాలు గుర్తించారు. కన్నూర్ రీజినల్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ హెచ్‌5ఎన్‌1 లక్షణాలు ధృవీకరించింది.  అయితే, ఇప్పటివరకు పెంపుడు పక్షులలో (కోళ్లు, బాతులు) ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ప్రస్తుత దశలో పక్షులను చంపాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. హెచ్‌5ఎన్‌1 గుర్తింపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ కే. విజయన్ ఆ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇరిట్టి మున్సిపాలిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారి, స్థానిక అధికారులను ఆదేశించారు. కేవలం ఒక కాకిలో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ గుర్తించినందున, ఎటువంటి ఔట్‌బ్రేక్, సర్వైలెన్స్ జోన్ ప్రకటించలేదని, అలాగే పక్షులను చంపాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

ఒకవేళ పక్షుల కళేబరాలు కనిపిస్తే, భద్రతా నిబంధనలను పాటిస్తూ మున్సిపల్ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో కాల్షియం కార్బోనేట్‌ను ఉపయోగించి వాటిని తగిన లోతులో పూడ్చిపెడతారని పేర్కొంది. ఈ పారిశుధ్య ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా గ్లోవ్స్, మాస్క్‌లు మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌ ధరించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని ప్రజల్లో ఎవరికైనా కారణం తెలియని జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉంటే, ఆ కేసులను నిశితంగా గమనించి నివేదించాలని ఆరోగ్య శాఖను కలెక్టర్‌ ఆదేశించారు.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు