Breaking News

వివాదం వేళ ట్విస్ట్‌.. డీకేతో కిరణ్‌ మజుందార్‌ షా భేటీ

Published on Tue, 10/21/2025 - 12:41

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బయోకాన్‌(Biocon) ఛైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా(Kiran Mazumdar-Shaw) భేటీ అయ్యారు. బెంగళూరు రోడ్ల దుస్థితి, చెత్త సమస్యలపై ఇటీవల బయోకాన్‌ ఛైర్మన్‌ పోస్టులు పెట్టారు. దీనిపై డీకే శివకుమార్‌ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కిరణ్‌ మజుందార్‌కు మద్దతుగా నిలిచిన పారిశ్రామిక వేత్త హర్ష్‌ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు.

ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్‌ ఛైర్మన్‌ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్‌.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై  బయోకాన్  లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్‌ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్‌ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కిరణ్ మజుందార్ షా భేటీ

 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)