Breaking News

వామ్మో..ఆ స్పీడ్‌ ఏంటి! నువ్వు లక్కీ బ్రో..!

Published on Fri, 11/06/2026 - 18:29

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో  ఒక సంఘటన నెట్టింట పలువుర్ని ఆశ్చర్యానికి గురి  చేస్తోంది. రీంగస్ నుండి ఖాటు శ్యామ్‌జీ వెళ్లే రహదారిపై  అతి వేగంగా దూసుకొచ్చిన ఒక బైకర్‌ రోడ్డు పక్కనే ఉన్న కాంక్రీట్ నిర్మాణాన్ని బలంగా ఢీకొట్టి, గాల్లోకి ఎగిరాడు. ఆ తర్వాత అంతే వేగంతో రోడ్డుపై పడ్డాడు.  ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బైకర్‌ బతికే ఉన్నాడా? ఈ భూమ్మిద అతగాడికి ఇంకా నూకలున్నాయా? వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసిన  ఈ  ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్  నెట్టింట  తెగ వైరలవుతోంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా సీసీటీవీ విజువల్స్‌ ప్రకారం మితిమీరిన వేగంతో వచ్చిన బైకర్‌  రోడ్డుపక్క ఉన్న ఒక పెద్ద దిమ్మను బలంగా ఢీకొట్టాడు.  ఎంత బలంగా అంటే.. దెబ్బకి ఆ ధాటికి గాలిలోకి ఎగిరి బలంగా రెడ్డుపై పడ్డాడు.  కొద్ది క్షణాల్లోనే ఆ వ్యక్తి ఎవరి సహాయం లేకుండానే లేచి నిలబడి, ప్యాంటు దులుపుకుంటూ లేచి.. కామ్‌గా వెళ్లిపోయాడు. పెద్దగా గాయాలైనా దాఖలాలు కూడా ఏమీ లేవు.

 నెటిజన్లు షాక్‌ 
ఇదొక  అద్భుతం అని  కొందరు, మరికొందరు ఇది కేవలం అదృష్టం అని మరికొందరు  కామెంట్స్‌ చేశారు. ఇదేం యాక్సిడెంట్‌ భయ్యా, మనోడికి భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయ్! అని మరికొందరు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. యముడు holiday లో ఉండి ఉంటాడని కొందరు  వ్యాఖ్యానించారు.

అతని ఆ బైకర్‌  తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయినప్పటికీ, పరిస్థితి ఎలా ఉంది, తలకు ఏమైనా దెబ్బలు తగిలియా అనేది వీడియో ఆధారంగా చెప్పడం మాత్రం కష్టం. దీనిపై అతని బంధువులునుంచి గానీ,   పోలీసుల నుంచి గానీ ఎలా ప్రకటన వెలువడలేదు. ఇలాంటి ప్రమాదాలలో వాహనం కిందపడే విధానం, కిందపడే ప్రదేశం,  రక్షణ పరికరాలు ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని రహదారి భద్రతా నిపుణుల మాట.. అతను హెల్మెట్ ధరించాడో లేదో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఎవరెన్ని ఊహలు చేసినప్పటికీ, వైద్య పరీక్షల ద్వారా మాత్రమే ఆయన ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుస్తుంది.

 నోట్‌ : ఏది ఏమైనా అతివేగం అనర్థం. వాహనంపై నియంత్రణ లేకపోవడం ప్రమాదం. హెల్మెట్ ధరించడం చాలా కీలకం.  మితిమీరిన వేగం, ఇతర వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం  ఉంది అనేది గమనించాలి. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)