Breaking News

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో ఆ అగ్రనేత కూడా?!

Published on Thu, 12/04/2025 - 10:55

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 19 మంది మావోయిస్టులు మృతి చెందారని గురువారం అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మృతుల్లో ఓ అగ్రనేత ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు భద్రతా బలగాల సిబ్బంది కూడా అమరులయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

అయితే ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల లభ్యం.. కూంబింగ్‌ కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య 25 దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే.. మృతుల్లో పీఎల్‌జీఏ-2 కమాండర్‌ వెల్ల మోడియం కూడా ఉన్నారని భావిస్తున్నారు. 

వెల్ల మోడియం (Vella Modiyam) మావోయిస్టు పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేత. దక్షిణ బస్తర్‌లో టాప్‌ కమాండర్ కూడా. ఆయనపై భారీగానే రివార్డు ఉంది. హిడ్మా తరహాలోనే వ్యూహాత్మక దాడులకు ఆయన నేతృత్వం వహించేవారు.  ఒకానొక టైంలో.. హిడ్మా కంటే కూడా పెద్ద మావోయిస్టు నాయకుడిగా పోలీసులు, భద్రతా దళాలు భావించేవి. మోడియం ఎన్‌కౌంటర్‌ నిజమే అయితే.. నక్సలైట్లకు పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)