Breaking News

లాలూ, రబ్రీ, తేజ్‌ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు

Published on Tue, 03/18/2025 - 10:57

పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడంలేదు. లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​జారీ చేసి, విచారణకు పిలిచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భూమికి ప్రతిగా ఉద్యోగం కుంభకోణానికి సంబంధించిన కేసులో వారిని విచారించేందుకు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. 

వీరిని పట్నాలో విచారించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు అతని భార్య రబ్రీ దేవి(Rabri Devi), పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లకు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. మార్చి 19న లాలూ యాదవ్‌ను విచారణకు పిలిచారు. ఈ విచారణ పట్నా జోనల్ కార్యాలయంలో జరగనుంది. ‘భూమికి ప్రతిగా ఉద్యోగం’ కుంభకోణంపై లాలూను విచారించనున్నారు. ఈ ఉదంతంలో మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై గత  ఏడాది ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో పాటు మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు.

ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)