Breaking News

దారుణం: ప్రముఖ జర్నలిస్టు హత్య..

Published on Fri, 08/18/2023 - 15:12

పాట్నా: బిహార్‌లో దారుణం జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టుని కిరాతకంగా హత్య చేశారు. రాణిగంజ్‌ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టు ఇంటి ప్రాంగణంలోనే ఈ దాడి జరిగింది. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

జర్నలిస్టు విమల్ యాదవ్ దైనిక్ జాగరణ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ఆయన తలుపుతట్టారు. విమల్ గుమ్మం వద్దకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్నలిస్టు విమల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై ఆస్పత్రి వద్ధ భారీ సంఖ్యలో గుమికూడిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై లోక్ జన్‌శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు, పోలీసులకే రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. దుండగులను పట్టుకునేందుకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని అన్నారు.  

ఇదీ చదవండి: కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు.. కారణం ఏమై ఉంటుందంటారు? 

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)