Breaking News

బీహార్‌ను భయపెడుతున్న వరదలు

Published on Tue, 07/09/2024 - 11:56

పట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. వివిధ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసి, గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గండక్ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బోటు ఆపరేషన్లు, పాలిథిన్ షీట్లు, సహాయక సామగ్రి, మందులు, పశుగ్రాసం, వరద షెల్టర్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, డ్రై రేషన్ ప్యాకెట్లు/ఆహార ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా  చూడాలన్నారు.

వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. బాధితులకు సహాయాన్ని అందించాలని, రాష్ట్ర ఖజానాపై విపత్తు బాధితులకు మొదటి హక్కు ఉంటుందని నితీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ వరదల కారణంగా ఏటా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ బాధితులను ఆదుకోవడం లేదని ఆరోపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)