Breaking News

కేలండర్‌లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట!

Published on Mon, 07/24/2023 - 11:38

బీహార్‌ విద్యాశాఖలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. విద్యాశాఖ ఒక విద్యార్థికి సంబంధించిన టీసీలో ఆ కుర్రాడి డేట్ ఆఫ్‌ బర్త్‌ ఫిబ్రవరి 30 అని రాసింది. నిజానికి ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే బీహార్‌ విద్యాశాఖ ఎంత నిద్రమత్తులో ఉన్నదంటే బీహార్‌ ప్రజలకు 30 రోజులు ఉంటున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ చూపిన ఈ నిర్లక్ష్యం ఆ పిల్లవాడి పాలిట సమస్యగా మారింది. 

ఈ ఉదంతం జముయీ జిల్లాలోని చకాయీ పరిధిలోని ఉత్క్రమిత్‌ మధ్య విద్యాలయలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అమన్‌ కుమార్‌కు సంబంధించిన ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌లో ఆ కుర్రాడి పుట్టిన తేదీ 2009 ఫిబ్రవరి30 అని ఉంది. ఈ విధమైన పుట్టినరోజు కారణంగా తమ పిల్లవాడికి 9వ తరగతిలో ఎక్కడా అడ్మిషన్‌ దొరకడంలేదని పిల్లవాడి తండ్రి రాజేష్‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ విషయమై పలుమార్లు విద్యాశాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. తన కుమారుని పుట్టినతేదీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెబుతున్నారని రాజేష్‌  యాదవ్‌ ఆరోపించారు. 

కాగా ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించగా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పుకాదని, ఆ విద్యార్థి సమర్పించిన డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌లో అలా ఉండి ఉంటుందన్నారు. దీని గురించి సంబంధిత అధికారులను విద్యార్థి తండ్రి సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్‌ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్‌ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)