Breaking News

కూలడంలో.. వరస కట్టిన వంతెనలు

Published on Thu, 07/04/2024 - 06:04

సివాన్‌(బిహార్‌): బిహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. సివాన్‌ జిల్లాలో 11 రోజుల క్రితం ఒక వంతెన కూలగా బుధవారం అదే జిల్లాలో మరో రెండు వంతెనలు కూలాయి. సరన్‌ జిల్లాలో ఇంకోటి కూలింది. బుధవారం ఘటనలు కలుపుకుని గత 15 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వంతెనలు కుప్పకూలాయి. 

జిల్లాలోని దేవరియా బ్లాక్‌ పరిధిలో గండకీ నదిపై దాదాపు 42 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చిన్నపాటి వంతెన బుధవారం ఉదయం ఐదుగంటలకు కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ‘‘ వంతెనలో కొంత భాగమే కూలింది. గత కొద్దిరోజులుగా వంతెనకు మరమ్మత్తులు చేస్తున్నారు. కుప్పకూలడానికి కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టాం’’ అని డెప్యూటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ముకేశ్‌ చెప్పారు. 

గత కొద్దిరోజులుగా గండకీ నది వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోందని, ప్రవాహం ధాటికి తట్టుకోలేక బ్రిడ్జి కూలిందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. సివాన్‌ జిల్లాలో తెఘ్రా బ్లాక్‌లోనూ మరో వంతెన కూలింది. ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్‌ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు. 

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)