Breaking News

ఇసుకలో సిమెంట్‌ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన!

Published on Sat, 06/24/2023 - 21:28

పాట్నా: బీహార్‌లో ఏ ముహుర్తాన వంతెనలు ప్రారంభించారు గానీ వరుసగా కూలుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం కిషన్‌గంజ్ జిల్లాలో మరో వంతెన కూలిపోయింది. కాగా రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన కావడం గమనార్హం.

రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మెచ్చి నదిపై ఉన్న వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. NH-327Eలో నిర్మాణంలో ఉన్న ఈ వంతెన పూర్తయితే కిషన్‌గంజ్, కతిహార్‌లను కలుపుతుందని అయన అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. వంతెన కూలడంపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ ఒరిగిపోయినట్లు తెలుస్తోందని అన్నారు.

ఇదే నెల మొదటి వారంలో అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ వంతెన కూడా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం గమనార్హం.​ 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతలోనే కూలిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే నెలలో నిర్మాణంలో ఉన్న రెండు వంతెనలు కూలిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇసు‍కలో సిమెంట్‌లో కలిపితే ఇలా జరగవని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

చదవండి: బాబోయ్‌ ఇదేం ఆచారం! ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి.. ఆపై

#

Tags : 1

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)