టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆదిమూలపు సురేష్ ఫైర్
Breaking News
మిడ్ డే మీల్‌లో పాము.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
Published on Sat, 05/27/2023 - 16:50
పాట్నా: బిహార్‌లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృస్టించింది. అప్పటికే ఆహారాన్ని తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అరారియాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలందరికీ సిబ్బంది కిచిడీ వడ్డించారు. ఈ క్రమంలో ఓ అబ్బాయికి వడ్డించిన ప్లేట్‌లో పాము కనిపించింది. వెంటనే ఆ ఆహారాన్ని పడవేయగా.. అప్పటికే భోజనం చేసిన పిల్లల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. కొందరు పిల్లలు వాంతులు చేసుకున్నారు.
విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆహారం తిన్న తర్వాత 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరోగ్యం విషమంగా ఉన్న 25 మంది పిల్లల్ని ఆసుపత్రిలో చేర‍్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.
చదవండి:శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...
స్థానిక సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం భోజనం పాఠశాల బయట వంట చేసి దానికి ఓ సప్లయర్ తీసుకువస్తాడు. పాఠశాల యాజమాన్యం తప‍్పిదం ఏమీ లేదని స్థానిక నాయకులు తెలిపారు. కాగా ఛప్రాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మే18న బల్లి కనిపించిన ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం
చదవండి:బోగీలను వదిలి రైలింజన్ పరుగులు!
Tags