Breaking News

సీక్రెట్‌గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్‌ బాస్‌ ఫేమ్‌ : స్పెషాల్టీ ఏంటంటే

Published on Sat, 07/11/2026 - 12:54

ప్రముఖ టీవీ నటి, బిగ్‌బాస్‌  ఓటీటీ -2 ఫేమ్‌  పాలక్ పుర్స్వానీ తన చిరకాల ప్రియుడితో ఏడడగులు వేసింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్‌లో ప్రియుడు రోహన్ ఖన్నాను పెళ్లాడింది. అంతేకాదు వీరి పెళ్లి 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం ముందు జరిగిన తొలి ఆధ్యాత్మిక వివాహంగా నిలుస్తోంది. అత్యంత సన్నిహిత వివాహ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌  చేయడంతో  ఇవినెట్టింట సందడిగా మారాయి.

కోయంబత్తూరులోని సద్గురు ఈషా ఫౌండేషన్‌లో ఆ పరమశివుని విగ్రహం ముందు జరిగిన ఈ వేడుక నెట్టింట అందరి దృష్టిని ఆకరిస్తోంది. సాధారణంగా వివాహ వేడుకలో వధువు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ వీరి పెళ్లి  వేడుక అందుకు భిన్నంగా నిలిచింది. 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం నేపథ్యంలో ఆ జంట నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా  2014లో టీవీ నటిగా కరియర్‌ను  ప్రారంభించిన పాలక్ పుర్స్వానీ  'రూహానియత్', 'బడే భయ్యా కి దుల్హనియా', 'యే రిష్తే హై ప్యార్ కే', 'ఏక్ ఆస్థా ఐసీ భీ', 'మేరీ హానికారక్ బీవీ'  'బడీ దేవరాణి' లాంటి సీరియల్స్‌, షోలతో  పాపులారిటీ సంపాదించుకుంది. 2019లో ఆమె 'నాచ్ బలియే 9', 2023లో 'బిగ్ బాస్ OTT సీజన్ 2'లో కూడా పాల్గొంది.  

పాలక్ - రోహన్ లవ్‌స్టోరీ
వీరి బంధం 2024లో మొదలైంది. ఏడాది తిరగకముందే, టర్కీ పర్యటనలో  రోహన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. గత  ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా తమ పెళ్లి  కబురును,  ఫోటోలను ఒక ఉమ్మడి పోస్ట్ ద్వారా  పంచుకున్నారు ఈ లవ్‌బర్డ్స్‌. 

"కొన్ని ప్రేమకథలను ఆ దేవుడే రచిస్తాడు. మా ప్రేమకథను మహాదేవుడు ఎంపిక చేశారు. రెండు ఆత్మలు... శాశ్వతంగా ఒక్కటయ్యాయి. 26.06.26." అంటూ పోస్ట్‌ చేశారు. 

పాలక్  ఎరుపు , గులాబీ రంగుల కలయికతో ఉన్న పెళ్లి లెహెంగాలో ఎంతో అందంగా కనిపించగా, వరుడు  భర్త రోహన్ లేత గోధుమ రంగు (బీజ్) షెర్వానీలో మెరిశాడు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)