Breaking News

MUDA Scam.. సీఎం సిద్ధరామయ్యకు ఊరట

Published on Fri, 02/07/2025 - 11:47

బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసుల నుండి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాది స్నేహమయి కృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు జస్టిస్‌ ఎం నాగప్రసన్న తిరస్కరించారు. ఈ క్రమంలో కేసు విచారణకు సీబీఐ దర్యాప్తు పరిష్కారం కాదు. లోకాయుత్త దర్యాప్తు చేయగలదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సిద్దరామయ్య తరఫున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా.. అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు.

ముడా స్కాం ఇదే..
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్‌ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.

కాగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను  ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్‌ మార్కెట్‌ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)