Breaking News

తమిళనాడు ప్రభుత్వానికి షాక్‌

Published on Tue, 12/30/2025 - 14:18

తమిళనాడు ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలింది. స్టాలిన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మద్రాస్‌ యూనివర్సిటీ సవరణ బిల్లును రాష్ట్రపతి భవన్‌ మంగళవారం వెనక్కి పంపించేసింది. మూడేళ్లుగా రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.

మద్రాస్ యూనివర్సిటీ చట్టం 1923 ప్రకారం.. తమిళనాడు గవర్నర్‌ యూనివర్సిటీకి ఎక్స్-ఆఫీషియో చాన్సలర్‌. వైస్‌ చాన్సలర్ నియామకం, తొలగింపు తదితర హక్కులు గవర్నర్‌ వద్దే ఉన్నాయి. అయితే.. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో స్టాలిన్‌ సర్కార్‌కు పొసగడం లేదు. గవర్నర్‌ వల్లే తమిళనాడులో వర్సిటీల వీసీ నియామకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాస్‌ వర్సిటీ బిల్లు ద్వారా గవర్నర్‌ అధికారాలకు చెక్‌ పెట్టాలని స్టాలిన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వైస్‌ చాన్సలర్‌ను నియమించుకునే అధికారం పొందడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా యూనివర్సిటీ పాలనను మార్చడం, అలాగే ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీని యూనివర్సిటీ సిండికేట్‌లో సభ్యుడిగా చేర్చడం తదితర అంశాలను బిల్లులో తమిళనాడు ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఈ బిల్లును గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపగా.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును ఆమోదించకుండానే తిరిగి పంపించారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు