Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నంబాల మృతి?

Published on Wed, 05/21/2025 - 11:02

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 25 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్‌ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. 

ఈ ఎన్‌కౌంటర్‌లో 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మృతుల్లో నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు బసవరాజుపై కోటిన్నర రివార్డు ఉంది. 

నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్‌ చదివిన వ్యక్తి. నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్‌ చదువుతూ పీపుల్స్‌ వార్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు ఉన్నారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి బసవరాజు. 

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)