Breaking News

మద్యం మత్తులో  80 అడుగుల టవర్‌ ఎక్కి..

Published on Mon, 02/03/2025 - 01:22

‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’ అని ఓ సామెత. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తీరు అచ్చం అలాగే ఉంది. జిల్లాలో ఉన్న బెరాసియా తహసీల్‌లో బర్‌ఖేడీ గ్రామానికి చెందిన 33 ఏళ్ల వివేక్‌ అనే వ్యక్తి పీకల దాకా తాగాడు. ఇంకేముంది వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మత్తులో 80 అడుగుల మొబైల్‌ టవర్‌ ఎక్కాలనుకున్నాడు. స్థానికులు అడ్డుకుంటున్నా సరే.. పక్కకు నెట్టిమరీ సునాయాసంగా ఎక్కాడు. టవర్‌ మీదకు ఎక్కనయితే ఎక్కాడు కానీ.. ఎట్లా దిగాలో అర్థం కాలేదు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. 

దీంతో స్థానికులు జహంగీరాబాద్‌ పోలీసులకు, మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతడిని 20 నిమిషాలపాటు మాటల్లో పెట్టి.. అగ్నిమాపక క్రేన్‌ సహాయంతో కిందకు దించారు. కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దిగిన వివేక్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనంతా స్థానికులు తమ సెల్‌ఫోనులో బంధించిన స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వీడియో వైరల్‌ అవుతోంది. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)