హత్రాస్ తొక్కిసలాట.. తొలిసారి స్పందించిన భోలే బాబా

Published on Wed, 07/03/2024 - 21:12

లక్నో : ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లో భోలే బాబా స‌త్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 నిమిషాల‌కు .. స‌త్సంగ్ ప్రాంగ‌ణం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. కానీ ఆ ఘ‌ట‌న త‌ర్వాత భోలే బాబా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్‌ హత్రాస్‌లో 121 మందికి మరణానికి కారణమైన భోలేబాబా ఓ ప్రకటన చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.

తన న్యాయవాది ద్వారా  ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వెళ్లిన చాలా సేపటి తర్వాత తొక్కిస లాట జరిగిందని తెలిపారు.సంత్సంగ్‌ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఓ నోట్‌ను విడుదల చేశారు.

కాగా, సామాన్యుల మరణానికి కారణమైన భోలే బాబాను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ స్పందించారు. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నాము అని ఆ నోట్‌లో పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)