Breaking News

యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్‌!

Published on Thu, 08/29/2024 - 11:41

లక్నో: ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. భయం గుప్పిట గడుపుతున్నారు అక్కడి ప్రజలు. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో తొమ్మిది మంది బలయ్యారు. ఇందులో ఎనిమిది మంది చిన్న పిల్లలే కావడం గమనార్హం.

గ్రామస్తుల భయాందోళనలతో.. తోడేళ్ల గుంపును తరిమికొట్టేందుకు జిల్లా అటవీశాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమికొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా.. ఇద్దరు చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమై తల్లిదండ్రులు వాటి వెంటపడడంతో.. పిల్లలను వదిలేసి అవి పారిపోయాయి. తీవ్రమైన గాయలైన చిన్నారులకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై.. స్థానిక ఎమ్మెల్యే  సురేశ్వర్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రివేళలో ఆయన కాపల కాస్తున్నారు ‘‘అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదు. గుంపుగా గ్రామాల మీద పడుతున్నాయి. ఇప్పటికే మూడు తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవటంపై అవగాహన కల్పిస్తా. నేను నా కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాం’’ అని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో గ్రామాల్లో ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందకు సీఎం యోగి ప్రభుత్వం‘‘ఆపరేషన్ భేడియా’’ను కూడా ప్రారంభించింది. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ పద్ధతులను ఉపయోగిస్తోందని యూపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)