Breaking News

ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి

Published on Tue, 10/08/2024 - 09:15

బహ్రాయిచ్‌: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలో నరమాస భక్షక తోడేళ్లనన్నింటినీ పట్టుకున్నామని అటవీశాఖ అధికారులు చేసిన ప్రకటన మరువకముందే మరో తోడేలు  ఓ చిన్నారిపై దాడి చేసింది. మహసీ ప్రాంతంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు  ఇంకా ఆగడంలేదు. ఇంటి వరండాలోని గదిలో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి అంజుపై తోడేలు దాడి చేసింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోడేలు దాడికి దిగిన వెంటనే అంజు కేకలు వేయడంతో అది ఆ చిన్నారిని వదిలి పారిపోయింది. బాధితురాలిని ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం బహ్రాయిచ్‌ మెడికల్ కాలేజీకి తరలించారు.

రాత్రి 11.30 గంటల సమయంలో తోడేలు  చిన్నారి అంజు మెడ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. అంజు కేకలు వేయడంతో తోడేలు బాలికను వదిలి పారిపోయింది. కాగా ఆ చిన్నారికి అయిన గాయాన్ని పరిశీలించిన బహ్రాయిచ్‌ డీఎఫ్‌ఓ అజిత్ ప్రతాప్ సింగ్  చిన్నారిపై తోడేలు దాడి చేసిందన్న కుటుంబ ఆరోపణను ఆయన ఖండించారు. ఇది కుక్క దాడిలా కనిపిస్తున్నదన్నారు.

బహ్రాయిచ్‌ ప్రాంతంలో తోడేళ్లు ఇప్పటివరకూ పదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్ల దాడుల్లో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇటీవల  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  బహ్రాయిచ్‌కు వచ్చి  బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ సహాయం అందించారు. నరమాంస భక్షక తోడేళ్లు కనిపించగానే చంపేయాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బహ్రాయిచ్‌ మహసీ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందులో ఐదింటిని తొలుత పట్టుకున్నారు. మిగిలిన ఆరో తోడేలును కూడా పట్టుకున్నామని అటవీ శాఖ ప్రకటించినంతలోనే మరో తోడేలు దాడి చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: హమాస్‌ చీఫ్‌ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్‌ మీడియా

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)