Breaking News

నేటితో ముగియనున్న జోడో యాత్ర

Published on Mon, 01/30/2023 - 06:08

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారత్  జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లో ముగియనుది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ క్లాక్‌ టవర్‌ వద్ద అత్యంత కటుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ 1948లో ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగరేయడం విశేషం. రాహుల్‌ మాట్లాడుతూ దేశ  ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని చెప్పారు.

సెప్టెంబర్‌ 7న మొదలైన రాహుల్‌ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 4 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మతసామరస్యమే ప్రధాన ఎజెండా సాగిన ఈ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌ ఉల్లాసంగా కనిపించారు. సోమవారం ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఆహ్వానించింది.   

బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకం
విపక్షాల మధ్య విభేదాలున్నా, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై పోరులో అవి ఐక్యంగా ఉంటాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. జోడో యాత్రలో పాల్గొనబోమని టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ చెప్పడంపై ఆయన స్పందించారు. జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి చేరినప్పటికీ ఫలితం మాత్రం దేశమంతటా ఉందన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ల విద్వేషం, అహంకారంల స్థానంలో తమ యాత్ర దేశానికి సోదరభావమనే ప్రత్యామ్నాయాన్ని చూపిందని అన్నారు.

Videos

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)