Breaking News

ఆ ఐదు చోట్ల అంబరాన్నంటే దాండియా వేడుకలు

Published on Wed, 10/02/2024 - 10:29

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. ఈ నవరాత్రుల వేడుకల్లో దాండియాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాండియా అనేది గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు దేశమంతటా దాండియాకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఆ ఐదు ప్రాంతాల్లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలని చాలామంది తహతహలాడుతుంటారు. మరి ఆ ప్రాంతాలెక్కడున్నాయి? అక్కడ వేడుకల్లో పాల్గొనాలంటే ఎంత రుసుము చెల్లించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అహ్మదాబాద్ (గుజరాత్)
గుజరాత్‌లోని పలు నగరాల్లో దాండియా వేడుకలు జరుగుతాయి. అయితే అహ్మదాబాద్‌లోని పసిఫిక్ మాల్‌లో జరిగే దాండియా నైట్‌కు ఎంతో ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.

వడోదర (గుజరాత్)
వడోదరలో నిర్వహించే దాండియా నైట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా టిక్కెట్ల ధరలు రూ.400 నుండి రూ.500 వరకు ఉంటాయి.  కొన్నిచోట్ల టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుంది.

థానే (మహారాష్ట్ర)
దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు గుర్తింపు ఉంది. దాండియా వేడుకలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనాలంటే ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300.

ఢిల్లీ
ఢిల్లీలోని రాజ్‌వాడ ప్యాలెస్‌లో దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ  ఎయిర్ కండిషన్డ్  ఏరియాలో దాండియా ఆడేందుకు  సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో పాల్గొనేవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.

బెంగళూరు
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ అత్యంత వేడుకగా దాండియా నైట్ నిర్వహిస్తారు. జేపీ నగర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.

ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)