Breaking News

టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!

Published on Sun, 08/18/2024 - 13:45

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్‌ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్‌పార్క్‌ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విపిన్‌ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 

4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్‌లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్‌ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. 

డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్‌ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)