Breaking News

మే అంటే హడలే

Published on Thu, 05/22/2025 - 11:11

బనశంకరి: మే నెల వర్షాలంటే బెంగళూరువాసులు వణికిపోవాల్సి వస్తోంది. అంత ఉధృతంగా వానలు పడి ముంపును కలిగిస్తున్నాయి. ఈ కష్టాలు పడలేక జనం మే వస్తోంటే గుబులు పడుతున్నారు.  

  1. అతి పెద్ద వానలకు రికార్డు  
    బెంగళూరులో మే నెలలో ఇప్పటివరకు 276 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ అని వాతావరణశాఖ తెలిపింది.  

  2. సిటీలో సాధారణంగా వేసవి కాలమైన మే నెలలో సరాసరి 128 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా. 

  3. కానీ ఈసారి మే పూర్తికావడానికి 10 రోజులు ఉండగానే  276.5 మిల్లీమీటర్ల వర్షం దంచేసింది. గత ఆదివారం ఒకేరోజు 132 మిల్లీమీటర్లు వర్షం పడి, ఒక నెలలో పడే వర్షం ఒకేరోజున కురిసింది.  

  4. 2023 మే నెలలో నగరంలో 305 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇప్పటివరకు మే లో కురిసిన అత్యధిక వర్షంగా రికార్డయింది. కొత్త రికార్డు సృష్టించడానికి 28.9 మిల్లీమీటర్లు వర్షం అవసరం.  

  5. నైరుతి రుతుపవనాలు ముందే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం వల్ల ఈ మేలో భారీ వర్షాలు పడ్డాయి. గత పదేళ్లలో కురిసిన రెండో అతిపెద్ద వర్షం ఈ మేలోనే నమోదైంది. 2022లో 270.2 మిల్లీమీటర్ల కుండపోత కురిస్తే, ఈ రికార్డును గత ఆదివారం వర్షం బద్ధలు కొట్టింది. ఎండలు, రుతుపవనాలు కలిసి ఎక్కువ వర్షాలు వస్తాయని అంచనా.  

 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)