Breaking News

చలాన్లలో ట్రిపుల్‌ సెంచరీ..!

Published on Tue, 02/04/2025 - 17:20

బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్‌ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్‌ సెంచరీ క్రికెట్‌ ఆ‍టలో కొట్టింది కాదు.ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా 311సార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి నగరంలోనే అత్యధిక ఉల్లంఘనల చలాన్లు పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.

ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామి స్కూటర్‌ను అతడే కాక అతడి బంధువులు ఇద్దరు ముగ్గురు తరచుగా నడపుతుంటారు.స్కూటర్‌ నడుపుతూ మొబైల్‌ ఫోన్‌ మాట్లాడడం, హెల్మెట్‌ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్‌ మీద బైక్‌ ఆపడం లాంటి ఉల్లంఘలనకు పాల్పడ్డారు.

అయితే 311 చలాన్లు జారీ చేసినప్పటికీ పెరియస్వామి నుంచి జరిమానా వసూలు చేయడంపై మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి పెట్టలేదు.అయితే ఓ నెటిజన్‌ షిబమ్‌ పెండింగ్‌ చలాన్ల విషయాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి ఎక్స్‌(ట్విటర్‌)లో పెట్టారు.దీంతో ఈ విషయం సోషల్‌మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.

సోషల్‌మీడియాలో ఈ వివాదంపై చర్చ మొదలవడంతో సిటీ మార్కెట్‌ పోలీసులు పెరియస్వామి ఆఫీసుకు వెళ్లారు. చలాన్ల విషయం చెప్పారు. దీనికి షాక్‌కు గురైన పెరియస్వామి తొలుత కొంత మొత్తం చెల్లిస్తానని, తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పారు.జరిమానాలన్నీ కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషనలో వదిలేస్తే బెటరని పెరియస్వామికి సలహా ఇవ్వడం విశేషం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)