ఏదైనా 30 రూపాయ‌లే.. ఎగబడిన జనం

Published on Sat, 12/06/2025 - 14:39

బెంగళూరు నగరంలో ఒకవైపు ఇండిగో విమానాలరద్దు  ఆందోళన కొనసాగుతుండగానే  మరో గందరగోళం వెలుగులోకివచ్చింది. ఏ వంటకమైనా  రూ. 30 అన్న ఆఫర్‌, విపరీతమైన ట్రాఫిక్‌తో పోలీసులకు తలనొప్పిగా మారింది.

బెంగళూరులోని హెబ్బల్‌లోని ఒక ప్రముఖ పబ్ తన మూడవ వార్షికోత్సవాన్ని సందర్భంగా'రూ. 30 కి ఏదైనా వంటకం' అనే ఆఫర్‌ను ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది దీంతో  కస్టమర్లు ఆ పబ్‌కు క్యూ కట్టారు. దాదాపు 300 మంది సీటింగ్ సామర్థ్యంతో, ఆ స్థలంలో దాదాపు 1,000 మంది  తరలి వచ్చారు.  దీంతో  జనాన్ని నియంత్రించ లేక సిబ్బంది నానా బాధలు పడ్డారు.

అటు  ఫుడ్‌ కోసం  పడిగాపులు జనం పబ్ వ్యతిరేకంగా నినాదాలతో  ఆందోళనకు దిగడం, విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో పరిస్థితిని నియంత్రించలేక, సాయంత్రం 4 గంటలకు ముందే అవుట్‌లెట్‌ను మూసివేసింది. సరిగ్గా ప్లాన్‌ లేకపోవడంతో, జనాన్ని అదుపు  చేయలేకపోవడంతో వేచి ఉన్న కస్టమర్లలో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. మరోవైపు ఈ రద్దీ కారణంగాఎస్టీమ్ మాల్ రోడ్,హెబ్బల్ ఫ్లైఓవర్‌తో సహా ప్రక్కనే ఉన్న రోడ్లపై ట్రాఫిక్ స్థంభించిపోయింది.  చివరికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.

దీనిపై  కస్టమర్లు ఏమన్నారంటే..
ఆఫర్‌కి సంబంధించి టైం ఏమీ చెప్పలేదు. కాబట్టి మేము డిన్నర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుని సాయంత్రం 6.30 గంటలకు బసవేశ్వరనగర్ నుండి బయలుదేరాం. కానీ భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఎస్టీమ్ మాల్ దగ్గరికి వెళ్లేసరికి పబ్‌ మూసేశారని తెలిపింది. పిల్లలు తాము ఆకలితో, బాధతో వెనక్కి వచ్చామని వాపోయింది ఏడుగురు కుటుంబ సభ్యులతో పబ్‌కు వచ్చిన 35 ఏళ్ల మహిళ. 

ఉదయం 11.30 గంటలకు పబ్‌కు చేరుకున్నాం అప్పటికే రెండు క్యూలు కనిపించాయి. మొదటి బ్యాచ్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు మాత్రమే లోపలికి అనుమతించారు, ఆ తర్వాత మమ్మల్ని లోపలి క్యూలోకి పంపారు. బ్యాచ్‌ బ్యాచ్‌లుగా జనం వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1 కల్లా ఆఫర్‌ముగిసిందన్నారు. నిరసనల తర్వాత, 10 మందిని బ్యాచ్‌లుగా అనుమతినిచ్చారు. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు మాకు టేబుల్ దొరికింది. చాలా భయంకరం అని మరొకరు చెప్పారు.

సిబ్బంది ఏమన్నారంటే 
వాస్తవానికి, ఆఫర్‌ను రోజంతా అమలు చేయాలనుకున్నాం. కానీ  1,000 పైగా జనం రావడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది చెప్పారు. ఇంత స్పందన ఊహించలేదని, భద్రతా కారణాల వల్ల పబ్‌ను ముందుగానే మూసివేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు జనం వెళ్లిపోయేంతవరకు షట్టర్లను మూసివేయమని తామే పబ్ యాజమాన్యానికి చెప్పి, జనాన్ని చెదరగొట్టామని పోలీసు అధికారి తెలిపారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)