Breaking News

తొక్కిసలాట.. విషాదాలు: మహా కుంభమేళా నుంచి బెంగళూరు వరకూ..

Published on Wed, 06/04/2025 - 21:01

న్యూఢిల్లీ: పద్దెనిమిది ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)(ఆర్సీబీ) విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయానికి గుర్తుగా నిర్వహిస్తున్న వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఇటీవలి కాలంలో దేశంలో ఆరు ప్రధాన విషాదకర తొక్కిసలాటలు జరగగా, పలువురు మృతిచెందారు. వందలాదిమంది గాయపడ్డారు.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్(2025, ఫిబ్రవరి)
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. మహా కుంభమేళాకు చేరుకునేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలు ఎక్కడానికి ప్రయాణికులు వేచివుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన 14- 15 ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించే ఫుట్-ఓవర్‌బ్రిడ్జిపై జరిగింది. కొంతమంది ప్రయాణికులు దిగుతున్నప్పుడు జారిపడి భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.

మహా కుంభ్(2025, జనవరి)
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది  మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. జనవరి 29న తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం కోసం గుమిగూడారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.

గోవా ఆలయం(2025 మే)
ఉత్తర గోవాలోని షిర్గావ్‌లో వార్షిక లైరాయ్ దేవి జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో  ఆరుగురు మృతిచెందారు. 50 మందికి పైగా జనం గాయపడ్డారు. విపరీతమైన రద్దీ, తగినంత భద్రతా నిర్వహణ లేకపోవడం వల్ల గందరగోళం చెలరేగి, తొక్కిసలాట జరిగింది.

తిరుపతి( 2025, జనవరి)
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందారు. ఈ దుర్ఘటన జనవరి 8న విష్ణు నివాసంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం కోసం టోకెన్లు పంపిణీ చేస్తున్న సమయంలో జరిగింది.

సంధ్య థియేటర్ (2024, డిసెంబర్‌)
2024 డిసెంబర్ 4 హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో విషాదానికి దారితీసింది. హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా జనం థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. ఈ జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మృతిచెందింది.

హత్రాస్ సత్సంగ్ (2024, జూలై)
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 'భోలే బాబా' నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో  తొక్కిసలాట జరిగి 121 మంది మృతిచెందారు. సత్సంగ్ నిర్వాహకులు 80వేల మందికే అనుమతినివ్వగా, 2.5 లక్షలకు పైగా జనం సత్సంగ్‌కు తరలివచ్చారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు