Breaking News

Bengaluru Water Crisis: నీటి వృథాపై వాటర్‌ బోర్డు కఠిన నిర్ణయం

Published on Mon, 03/25/2024 - 13:03

బెంగళూరు: తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నబెంగళూరు నగరంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలపై వాటర్‌బోర్డు కన్నెర్ర చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.1లక్షలు వసూలు చేసింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, మొక్కలకు, ఇతర అత్యవసరం కాని వాటికి వాడతున్నారని సోషల్‌ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా కుటుంబాలపై వాటర్‌బోర్డు చర్య తీసుకుంది.

కావేరి నీరు, బోర్‌ నీళ్లతో హోలీ వేడుకలు జరపడాన్ని వాటర్‌బోర్డు ఇప్పటికే నిషేధించింది. నగరంలోని పలు హోటళ్లు హోలీ వేళ  రెయిన్‌ డ్యాన్స్‌ ఈవెంట్లు ప్రకటించంతోనే వాటర్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెయిన్‌ డ్యాన్సులు ఉంటాయని ప్రకటించిన హోటళ్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి.

కాగా, షాపులు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో నీటి వాడకాన్ని నియంత్రించేందుకుగాను ఎయిరేటర్స్‌ను వాడాలన్న నిబంధనను నగరంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ట్రీటెడ్‌ వాటర్‌తో చెరువులను నింపి తాగునీటిగా కాకుండా ఇతర అవసరాలకు వాటిని వాడేందుకు వాటర్‌ బోర్డు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. 

ఇదీ చదవండి.. బీజేపీలో కేఆర్‌పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)