వదిలేయండి ప్లీజ్‌.. రూ.4 లక్షల లంచంతో సీఐ దొరికిపోయి..

Published on Sat, 01/31/2026 - 10:47

బెంగళూరు: లంచం తీసుకుంటూ బెంగళూరులోని కేపీ.అగ్రహార సీఐ గోవిందరాజు లోకాయుక్త పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలు.. చిట్టీల విషయంపై వివాదం ఏర్పడటంతో సూరజ్‌ అనే వ్యక్తిని సీఐ గోవిందరాజు నిత్యం స్టేషన్‌కు పిలిపించి వేధించేవాడు. కేసునుంచి తప్పించేందుకు రూ.5 లక్షలకు డిమాండ్‌ చేశాడు.  తొలుత రూ.లక్ష తీసుకున్నాడు. మిగతా డబ్బు కోసం డిమాండ్‌ చేసేవాడు. ఏసీపీకి కూడా వాటా ఇవ్వాలని, వెంటనే నగదు సమకూర్చాలని ఒత్తిడి చేశాడు. దీంతో  సూరజ్‌ లోకాయుక్తను ఆశ్రయించాడు. 

పథకం ప్రకారం సూరజ్‌ గురువారం చామరాజపేట గ్రౌండ్‌ వద్ద నగదు అందజేస్తుండగా  లోకాయుక్త ఎస్‌పీ శివప్రకాష్‌దేవరాజు నేతృత్వంలో  అధికారులు దాడి చేశారు. నగదు తీసుకుంటున్న సీఐని పట్టుకున్నారు. అయితే సీఐ కేకలు వేస్తూ హల్‌చల్‌ చేశాడు.  ఆరుమంది అధికారులు అతన్ని బంధించి స్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదుదారుడు సూరజ్‌ మాట్లాడుతూ పోలీసులు న్యాయం చేస్తారని వారిని ఆశ్రయిస్తే ఇక్కడ కూడా లంచాల కోసం గోల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లోకాయుక్త ఎస్పీ మాట్లాడుతూ సీఐ గోవిందు నుంచి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

 

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)