Breaking News

Auto Fares: మినిమం రూ. 36.. మరి వెయింటింగ్‌?

Published on Tue, 07/15/2025 - 10:45

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో నాలుగేళ్ల తరువాత ఆటో రిక్షా ఛార్జీలను అధికారికంగా సవరించారు. దీని ‍ప్రకారం ప్రయాణికులు 2025, ఆగస్టు ఒకటి నుంచి, మొదటి రెండు కిలోమీటర్లకు రూ.36 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బేస్ ఛార్జీ రూ.30 నుంచి పెరిగింది. ప్రతి అదనపు కిలోమీటరుకు ఛార్జీ రూ.18గా సవరించారు. గతంలో కి.మీ.కు రూ.15గా ఉంది. జిల్లా రవాణా అథారిటీ అధ్యక్షుడు, బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ ఈ సవరణను తెలియజేశారు.

దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, మొదటి 5 నిమిషాల వెయిటింగ్ సమయం ఉచితం. అయితే ఆ తర్వాత ప్రతి 15 నిమిషాల వెయిటింగ్‌కు రూ.10 వసూలు చేయనున్నారు. ప్రయాణీకులు 20 కిలోల వరకు బరువున్న లగేజీని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తీసుకెళ్లవచ్చు. ఉచిత పరిమితిని దాటిన ప్రతి 20 కిలోలకు రూ.10 అదనపు ఛార్జీ వర్తిస్తుంది. సవరించిన ఛార్జీలు రాత్రి ప్రయాణానికి కూడా వర్తిస్తాయి. కాగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలలో కొత్త ఛార్జీల చార్ట్‌ను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు.

ఛార్జీల సవరణపై వివిధ రవాణా సంఘాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఆటో ఛార్జీల పెంపును తాము స్వాగతిస్తున్నామని కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నటరాజ్ శర్మ అన్నారు. అయితే, అదనపు కిలోమీటరుకు ఛార్జీని రూ. 18కి బదులుగా రూ. 20గా చేయాలని ఆయన సూచించారు. డ్రైవర్లు అగ్రిగేటర్ యాప్‌లకు బదులుగా, మీటర్‌పై ఆటోలను నడపాలని  శర్మ కోరారు. కాగా కొన్ని ఆటో యూనియన్లు బేస్‌ ఫేర్‌ రూ. 20 ఉంటుందని ఆశించామని పేర్కొన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)